ఊహించని స్నేహం కలిసింది
ఊహలకందని బంధం వేసింది
తెరచి చూపమంది ఎదలోని భావాలను
పంచి పెట్టమంది మనస్సులోని స్నేహమాధుర్యాన్ని
కులమతాల కట్టుబాట్లను త్రెంచేయమంది
పెద్దల పంతాలను ప్రక్కకు నెట్టేయమంది
అంతస్థుల అగాధాలను దాటేయమంది
రెండు గుండెల చప్పుడు ఒక్కటేనంది
చేయి చేయి కలపమంది
నాకు నీవు నీకు నేను సాయమంది
ఒకరికొకరు తోడుగ కలిసి సాగమంది
అది "ప్రేమ ప్రయాణమే" అంది