Tuesday, February 24, 2009

ప్రేమ .....

గెలుపు వరిస్తుంది కాని ప్రేమ అలా కాదు అది కరుణించాలిభవిష్యత్తు లొ నువ్వెలా ఉండబొతావన్నదీ ప్రేమ కు ముఖ్యం కాదు ప్రేమ ముందు నువ్వు మోకరిల్లాలి ప్రాధేయపడాలి యుగాలి నిరీక్షించాలి అప్పటికైనా దయ తలిస్తే తలుస్తుంది ప్రేమ కరుణిస్తే నువ్వు గెలిచినట్లే ప్రేమ నిన్ను త్రుణీకరిస్తే... తట్టుకొని నిలబడినా నువ్వు గెలిచినట్లే

Thursday, February 19, 2009

నీవు లేని లోకంలొ

నీవు లేని లోకంలొ జీవించగలనా...
నీవు లేని నా జీవితం ఊహించగలనా...
ఈ జన్మలొ నేను నిన్ను చూడగలనా...
మరుజన్మ నాకుంటే నీ తోడై ఉండనా...
కలకాలం నీ కొసం నీ నీడై బ్రతకనా...

చెప్పలేను!విప్పలేను!!

చెప్పలేను మనస్సును విప్పలేను
నా కవితల రూపం నీవేననీ
నా కవితల భావం నీ మదియేననీ
నా కవితలు అంకితం నీకేననీ
చెప్పలేను మనస్సును విప్పలేను

స్నేహం..

కన్నులు కలలను మరచిపోవు...

ఊపిరి శ్వాసను మరచిపోదు...

వెన్నెల చంద్రుడిని మరచిపోదు...

నా మనసు నీ స్నేహన్ని మరచిపోదు...

విరిసిన వెన్నెల కరిగిపోతుంది...

వికసించిన పువ్వు వాడిపోతుంది..

కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది...

వద్దన్నా వచ్చేది మరణం...

పోవద్దన్నా పోయేది ప్రాణం..

తిరిగి రానిది బాల్యం....

మరువలేనిది మన స్నేహం..

కుల మత బేధం లేనిది...

తరతమ భావం రానిది...

ఆత్మార్పణమే కోరుకొనేది...

ప్రతిఫలమన్నది ఎరుగనిది...స్నేహమది

మనిషికొ చరిత్ర

మనిషికొ చరిత్ర అన్నది ఎంత నిజమో
నా మనస్సుకొ చరిత్ర అన్నది అంతే నిజం
మనస్సుకు నచ్చిన వారు నాకు చేరువవ్వరు
నన్ను చేరాలనుకున్న వారికి నేను దూరమవుతాను

సంధ్య వేళ...

సంధ్య వేళలొ చిగురించింది మన స్నేహం
సంద్రపు అలలా వచ్చింది నా కొసం
తలచాను నీతొ మంచి అనుబంధం
ఏ నాటికైన వేచివుంటా నీ కొసం...