Sunday, January 13, 2013


నా చెలి...

అందమైన గులాబీ ని చూసాను
నీ నవ్వే అనుకున్నాను
అందుకోవాలని చేయి చాచాను
దాగి వున్న ముల్లు ని చూసి వెనుదిరిగాను
అందుకోలేనే మో అని నిరాశ కలిగింది
కానీ...
అందుకోవాలనేఆశ వుంది
అందుకే వేచి వున్నాను
ముల్లున్నా... ఎదలో గుచ్చుకుంటున్నా
భరిస్తాను
నా మనసు లో దాచుకుంటాను

Sunday, May 20, 2012

ఓ నేస్తమా..................

ఓ నేస్తమా..................
స్నేహమనే ఉద్యానవనం లో 
మధుర గానాన్ని ఆలపించే 
వసంతకాలపు కోకిలవు నీవు 
దు:ఖపు ఎడారిలో 
చల్లటి వర్షాన్ని కురిపించే
శ్రావణకాలపు మేఘానివి నీవు 
బాధల చీకటిలో 
చల్లటి వెన్నెల కురిపించే 
పౌర్ణమి నాటి చందమామ నీవు
చిరస్తాయిగా నిలిచిపోవాలి నేస్తం
శిధిలమై పోయేంత వరకు నా దేహం 
కలకాలం మన స్నేహం 
నీతో నా సమస్తం 
గుర్తుంటావ్ అనుక్షణం 
నన్ను గుర్తుంచుకో ప్రతీక్షణం...

Monday, June 21, 2010

ప్రేమ ఏమి కొరుకుంటుంది…?

ప్రేమ- ప్రేమించిన వ్యక్తి నుంచి ఏమైన కొరుకుంటుందా…? ఆశిస్తుందా…?
మన కళ్ళ ముందు ఎన్నొ ప్రేమల్ని చూస్తాం కొన్ని ప్రేమలు పెళ్ళి బంధం తొ ఏకమవుతాయి అంటే ప్రేమ పెళ్లి ని కొరుకుంటుందా?
మరికొన్ని ప్రేమలు ఫలించని పరిస్థితుల వల్ల త్యాగం తొ ముగుస్తాయి. ఆంటే అర్ధం ప్రేమ త్యాగాన్ని కొరుకుంటుందా?
చాల మంది ప్రేమ త్యాగాన్ని కొరుకుంటుంది అంటారు అంటె త్యాగాన్ని కొరుకొని ప్రేమలు నిజమైనవి కావనా?
పెళ్ళితొ ఒక్కటైన ప్రేమలొ పెళ్లి తరువాత కూడా ప్రేమ వుంటుందా? ఉండి తీరాలి కద! ఆందరిలొ అలా ఇంకా ఉంటూనే ఉందా…?
త్యాగం తొ వేరై పొయిన ప్రేమల్లొ విడిపొయాక తనమీద ప్రేమ వుండదా…?
ప్రేమ కొరుకునేది త్యాగమే అయ్యినప్పుడు తను విడిపొయాక తన మీద ప్రేమ భావం వుండకూడదు కదా!
కాని విడిపొయాక ఇంకా తన ప్రేమ భావాల్లొ మునిగిన వారున్నారు కదా…!
మరి ప్రేమ నిజంగా ఏమి కొరుకుంటుంది…?
వేరెదేన్నైనా కొరుకుంటుందా???

Saturday, January 2, 2010

నా ప్రేమ...

తొలి చూపులొ వలిచాను నిన్ను
ఆ క్షణం నుండే మరిచాను నన్ను
నా చిరు మదిలొ పులకింత రేపావు
నా ఎద లయకు రాగానివయ్యావు
వేయ్యి జన్మల ఫలంతొ నీ ప్రేమ పొందిన నాడు
మనసున సంబరాలు అంబరాన్ని అంటాయి నా ప్రేమ అలలు నీ మది తీరాన్ని తాకాయి
ప్రేమ చిన్న అల అయితె ఒక సంద్రాన్ని ఇచ్చేవాడిని
ప్రేమ పచ్చటి ఆకు ఐతె ఒక మహా వ్రుక్షాన్ని ఇచ్చేవాడిని
ప్రేమ ఒక చిన్న గ్రహమైతె ఒక పాలపుంతనే ఇచ్చేవాడిని

నీ పలుకులొ తియ్యదనం,
నీ చూపుల్లొ సూటిదనం
నీ కౌగిట్లొ వెచ్చదనం మరువలేను ప్రతి క్షణం
మన ఊహలతొ ప్రపంచాన్ని చుట్టాం చిరు ఆశలతొ స్వర్గాన్ని మీటాం
కాని తాడు తెగిన గాలిపటం లా... మన ప్రేమ నేలకు ఒదిగింది...
కనుపాప దాటని కల వలె ఎద మడుగులొ ఇంకిపొయింది
కాన లేని కనులెందుకు...?
నీవు లేని ఈ జీవం ఎందుకు...? అనుకున్నా
కానీ
కనులుండేను కలలొ నిన్ను చూచుటకు బ్రతికుండేను నేను నిన్ను చేరుటకు అని ఆశతొ
నీ స్మ్రుతులను ఆక్రుతి గా మలిచి నా మనసును కొవెలగా చేసి ఎల్లప్పుడు నిన్ను ఆరాధిస్తున్నా...

Thursday, October 29, 2009

ఈ స్నేహం

జాబిలి పంచే చెలిమికి కలువ రేకులు వికసిస్తాయని ............
సూర్యుడు పంచే చెలిమి వెంటే ప్రొద్దు తిరుగుడు పయనిస్తుందని .....
తెలిసిన వారే స్నేహితులంట .......
మనసు తెలిసిన వారే మన తోడంట.......

ఎన్ని ప్రేమలు తమ పవిత్రతను ప్రశ్నించుకున్నాయో .......
మోహపు జాడలు లేని ఈ స్నేహపు ప్రేమను చూసి ........
ఎన్ని బంధాలు తమ అనుబంధాన్ని శంకిచాయో.......
రక్తపు సంభందం లేని ఈ బంధాన్ని చూసి .......

ఎన్ని కాలాలు ఎంతగ కక్ష కట్టాయో........
ఊసు పోని కబుర్లు తమని కరిగించే సాధనాలని తెలుసుకొని ........
ఎన్ని లోకాలు ఎంతగా కుళ్ళు కున్నాయో ........
ఎదురయ్యే ప్రతి కష్ట నష్టాల భారం సగమైపోతుందని ..........

నీ ఆత్మను నీ మనసు నవ యవ్వనం సంతరించుకొనేలా చేస్తున్న
ఈ స్నేహం
యే జన్మ ఫలమో యే దేవుడి వరమో.........

నా హృదయమా….

స్పందించే హృదయమా….
సవ్వడి లేక మిగిలావా……,
స్వర్గాలు చూశావా…,
సుధీర్గ నరకం లా మిగిలవా.!!
ప్రేమించిన ప్రాణానికి...,
శాశ్వత విరహం మిగిల్చవా..!!!

Saturday, June 20, 2009

ప్రేమా ...ప్రేమా...!

వయ్యస్సు కెంతొ ఇష్టమైన కల వరమా
మనస్సు కెంతొ ఇష్టమైన పరవశమా
ఫ్రేమా ప్రేమా పంతాలు పెంచకమ్మా
ఫ్రేమా ప్రేమా బంధాలు తెంచకమ్మా