Saturday, February 16, 2008

నా కాలం

గతించిన నా కాలం "గతుకుల మయం"

కదులుతున్న నా కాలం "కన్నీళ్ళమయం"

రాబొయే నా కాలం

రాసుకొబొతున్న ఓ "అగ్ని కణం"

Thursday, February 14, 2008

స్నేహమా!!! లేక నా పాలిట శాపమా!!!

స్నేహమా!!! లేక నా పాలిట శాపమా!!!

చిరునవ్వుతొ పరిచయం అయ్యావు

అభిమానంతొ నాకు దగ్గర అయ్యావు

నీవు నాపై చూపిన అప్యాయతకు

నీను పొందిన సంతొషం అంతా ఇంతా కాదు

ఆ సంతొషం నాకు ఒక కల లాగే మిగిలింది

ఆ కల ఒక పీడ కల అని తెలిసిన తరువాత

నేను పడిన బాధ క్రితం సంతొషం కన్నా చాలా ఎక్కువ
నీవు నాపై చూపిన అభిమానం నిజమనుకున్నాను
నీవు నాపై చూపిన అప్యాయత నిజమనుకున్నాను
ఇవి అన్ని ఒట్టి నా భ్రమ మాత్రమే

నేను ప్రేమ అనుకున్నాను

దానికి నువ్వు పెట్టిన పేరు స్నేహం

నీది స్నేహమా!!! కానే కాదు

" ఒక తియ్యటి శాపం "..!




మీ
కొమ్మి గాడు

ఓంటరి దు:ఖం

ఓంటరి దు:ఖం
గుండె ఎడారిలొ
తొలకరి జల్లై కురుస్తుంది
చెదరిన స్వప్నం
కళ్ళనిండా మ్రుత్యువై పరచుకుంటుంది
చెప్పాలని వుంది
కాని ఇప్పటిదాక దాచుకున్న
నిన్నటి కన్నీళ్ళ వెచ్చదనం  
వేడి వెన్నలై పారూతూనే వుంది
హఠాత్తుగా మేల్కొన్న నిర్లిప్తత
గొంతు నిండా నిస్సబ్ధ సంద్రమై పొంగుతుంది
ఏ ఙాపకాన్ని హత్తుకున్నా
జల జల రాలే కన్నీటి బిందువులే
రెప్ప వాల్చని రాత్రుల్లొ
మౌన పత్రాలై
ఘనీభవిస్తున్న దేహం లొకి
సుడులు తిరుగుతాయి
సగం రాత్రి కరిగాక
నిస్సబ్ధం ఆవరిస్తుంది
చీకట్లొ తడిసిన మౌనం
ఒక సుదీర్ఘ నిట్టూర్పుతొ
ఆరుబయట తూఫాను కొసం
కిటికీ తెరుస్తుంది
పొరలు పొరలుగా విచ్చుకున్న ఏకాంతం లో
చిరునవ్వుతొ మ్రుత్యువును కౌగిలించుకుంటుంది.