Saturday, June 21, 2008

ఓ ఫ్రియా

ఓ ఫ్రియా,
లేత తమలపాకుల్లాంటి నీ పాదాలకి,
నీ లేత  రక్తమే సింధురమై లయబద్దంగా చిందులేస్తూ,
దంతాల్లా మెరిసే నీ పాదాలు చూసిన క్షణాన
నాలొ మొహం పెరిగింది, నా మనసు కరిగింది

కన్నీటి సంద్రం

కన్నీటి సముద్రం లొ నన్ను విడిచి వెల్లిపొతున్నావా
ఇది ఓ కలలాగ భావించి జీవించమంటున్నావా
నీ నవ్వులలొనే కాదు నీ కన్నీల్లలొ కూడా
నీ సంతొషం లొనే కాదు నీ దుహ్ఖం లొ కూడా
నీతొనే వుంటాను చెలియా... నన్ను నమ్మవా...
నువ్వు అంటే ఇష్టమంటావ్ కాని ప్రేమ లేదంటావ్
కాని నేను నీ ప్రేమకొసమే తపిస్తున్నాను అని అర్ధం చేసుకొవు
నిన్ను స్నేహితురాలిగా పొందానన్న సంతొషం కన్నా
నీ ప్రేమ పొందలేకపొతున్నానన్న బాధ నన్ను తరుముతుంది

తను

తన సుమధుర దరహాసంతొ- తొలి చూపులొనే నా మది దొచిన
తన రూపం ఈ స్రుష్టి కే ప్రతి రూపం

తన పెదవులపై చిరునవ్వు  - ఓ అందమైన గులాబీ పువ్వు
నవరసభరితమైన తన ముఖ సౌందర్యం వర్ణనాతీతం

తనే నా హ్రుదయ రాణి  -  తనే నా ప్రేమ వాణి
తను లేని జీవితం నరకం  -   తనే నా జీవిత మారకం

తను ఎప్పటికైనా వస్తుందని  -  నా ఆశ ఫలిస్తుందని
ఫ్రతి నిముషం ఒక యుగంలా గడుపుతున్న ఈ ప్రేమికుడిని కరుణించవా ఇకనైనా…

Friday, June 20, 2008

నువ్వేనా... నీ తలపులేనా...

చిరుగాలి సవ్వడిలొ నేను విన్న సంగీతం నీ పలుకులేనా…?
మదిలొ రేగె అలజడులకు కారణం నువ్వేనా…?
కంటిపాపగా దాచుకున్న నీరూపం కన్నుల ఎదుటకు రాదేలా…?
నిన్ను చూడాలని ఆశ పడే ఈ పిచ్చి మనసు చేసే గారడీని ఆపేదెలా…?
నాలొని ఊసులను నీ చెవిలొ గుసగుసగా చెప్పాలని ఈ తపనేలా…?
నీ రాక కొసం ఎదురు చూసి అలసిపొయిన నా కలువ కన్నులకు నిద్ర కరువయ్యి…
అనుక్షణం నీ ఆలొచనలతొ నా హ్రుదయం బరువయ్యింది…
ప్రతిక్షణం నీ తలపులలొ విహరిస్తూ...