ఇది నిజమా?
నువ్వు నా దానివి కావా?
నీ మలినం లేని మనసు.. నీ ముత్యాల్లాంటి మాటలు.. చిలిపి నవ్వులు.. చిరు కొపాలు.. ఇవేమి నావి కావా? నీ అందమైన అమాయకత్వం.. నీ చుడ చక్కని రూప లావణ్యం..వేరొకరి సొంతమా?
"నువ్వు నాదానివి కాదు!" అనే నిక్రుష్టమైన నిజం ఓ అందమైన అబద్దం అయిపొవాలని అని అనుక్షణం పరితపిస్తున్నా.."నువ్వు నమ్మలేకపొయినా ఇది నిజమేరా!" అంటూ ప్రతి నిముషం నా పిచ్చి మనసు పదే పదే గుర్తు చేస్తుంది. నా ప్రాణం గా, నా ప్రపంచం గా భావించిన నిన్ను నేను కొల్పొతున్నాననే నిజాన్ని విని ఎలా తట్టుకొవాలొ తెలియటం లేదురా! నా వాకిలిలొ రంగవల్లులు వేసే రాణివి.. నువ్వు నా కౌగిలిలొ కరిగిపొయే జాబిల్లివి కాదన్న విషయం ఎలా మర్చిపొమ్మంటావు చెప్పు! మువ్వలా మనస్సు లొ సందడి చేస్తావు అనుకుంటే.. గుండెల్లొ కట్టిన గుడిని వదిలేసి గగనం లొ రివ్వున ఎగిరిపొతే ఎలా నేస్తం? ఎన్నెన్నొ రంగుల కలల్లొ విహరించిన నాకు ఇప్పుడు భవిష్యత్తు ఒక భేతాళ ప్రశ్నలా మిగిలింది. నువ్విలా బాధిస్తుంటే జీవితం లొ నేనేమి సాధించగలను చెప్పు! అందుకేనేమో బ్రతుకంతా అంధకారంగా కనిపిస్తుంది,అయిష్టంగా అనిపిస్తుంది!!
ఒక్క విషయం లొ మాత్రం నాకు నిజంగా ఈర్ష్యగా ఉంది. నీ కొసం వేచి చూడకపొయినా,నిముషానికి నాలుగు వేల సార్లు నిన్ను తలచుకొకపొయినా, నిన్నే స్మరిస్తూ నిద్రలేని రాత్రులెన్నొ గడపకపొయినా, కలలొ కూడా నీ పేరే పిచ్చిగా జపించకపొయినా,నాలాగా నిన్ను ఇష్టపడకపొయినా, నాలాగా నిన్ను అభిమానించకపొయినా, నాలాగా నిన్ను ఆరాధించకపొయినా, ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించకపొయినా.. నిన్నటి వరకు నీతొ ముఖ పరిచయం కూడ లేని ఓ వ్యక్తి నిన్ను సొంతం చేసుకొబొతున్నాడు అని తెలిసి అతని అద్రుష్టాన్ని చూడలేక నా మనస్సు నిజం గా ఈర్ష్యపడింది. నేను ఓడిపొతాను అని తెలిసినా నా మనసు నీ మనసుని గెలుచుకొవాలని అనుక్షణం ఎంతొ పొరాడింది,ఆరాటపడింది! కాని ఫలితం మాత్రం ప్రతికూలమయ్యింది.నిన్నుకొల్పొతున్నాననే బాధ పడుతున్నా.. నా ఓటమిలొ ఏదొ తెలియని చిన్న సంతొషం! ఒకప్రక్క కొంచెం గర్వం కూడా! బహుశా నాకూ స్పందించే హ్రుదయం ఉందని మొదటిసారిగా తెలిసినందుకేమో!
ఓ తియ్యని జ్ఞాపకం లా మిగిలిపొతావొ.. జాబిలిలా జీవితాంతం వెంటపడతావొ తెలియదుకాని..! ఓ విషయం మాత్రం నా మనస్సాక్షిగా చెప్పాలనుకుంటున్నాను,అది... "ఐ మిస్ యు మై స్వీట్ హార్ట్..."
No comments:
Post a Comment