Thursday, October 29, 2009

ఈ స్నేహం

జాబిలి పంచే చెలిమికి కలువ రేకులు వికసిస్తాయని ............
సూర్యుడు పంచే చెలిమి వెంటే ప్రొద్దు తిరుగుడు పయనిస్తుందని .....
తెలిసిన వారే స్నేహితులంట .......
మనసు తెలిసిన వారే మన తోడంట.......

ఎన్ని ప్రేమలు తమ పవిత్రతను ప్రశ్నించుకున్నాయో .......
మోహపు జాడలు లేని ఈ స్నేహపు ప్రేమను చూసి ........
ఎన్ని బంధాలు తమ అనుబంధాన్ని శంకిచాయో.......
రక్తపు సంభందం లేని ఈ బంధాన్ని చూసి .......

ఎన్ని కాలాలు ఎంతగ కక్ష కట్టాయో........
ఊసు పోని కబుర్లు తమని కరిగించే సాధనాలని తెలుసుకొని ........
ఎన్ని లోకాలు ఎంతగా కుళ్ళు కున్నాయో ........
ఎదురయ్యే ప్రతి కష్ట నష్టాల భారం సగమైపోతుందని ..........

నీ ఆత్మను నీ మనసు నవ యవ్వనం సంతరించుకొనేలా చేస్తున్న
ఈ స్నేహం
యే జన్మ ఫలమో యే దేవుడి వరమో.........

నా హృదయమా….

స్పందించే హృదయమా….
సవ్వడి లేక మిగిలావా……,
స్వర్గాలు చూశావా…,
సుధీర్గ నరకం లా మిగిలవా.!!
ప్రేమించిన ప్రాణానికి...,
శాశ్వత విరహం మిగిల్చవా..!!!

Saturday, June 20, 2009

ప్రేమా ...ప్రేమా...!

వయ్యస్సు కెంతొ ఇష్టమైన కల వరమా
మనస్సు కెంతొ ఇష్టమైన పరవశమా
ఫ్రేమా ప్రేమా పంతాలు పెంచకమ్మా
ఫ్రేమా ప్రేమా బంధాలు తెంచకమ్మా

Wednesday, May 27, 2009

నా ప్రియా...

వలపు వాన లొ తడిసావో...
ప్రేమ గొదావరి లొ మునకేసావో...
ఏమో కాని...
ఒక్కసారిగా తడి సొకులతొ
కనపడితే గొంతు తడారి
చేష్టలుడిగి పొతున్నా...
గుట్టులన్ని రట్టయి...
అలా ఎదురు పడితే శ్వాస
రెట్టింపై తడబడిపొతున్నా...
ఆ... అందాలను ఆస్వాదించేందుకు
వున్న కళ్ళు చాలక ఏమి చేయాలొ
తొచక రెప్ప వెయ్యక నిలుచున్నా
నిన్ను ఇలాగే చుస్తూండాలనే
చిలిపి కొరిక మెదిలి
కళ్ళని కదలనివ్వక
కళ్ళెమెయ్యడానికి దేవుణ్ణి ప్రార్దిస్తున్నా...

Tuesday, February 24, 2009

ప్రేమ .....

గెలుపు వరిస్తుంది కాని ప్రేమ అలా కాదు అది కరుణించాలిభవిష్యత్తు లొ నువ్వెలా ఉండబొతావన్నదీ ప్రేమ కు ముఖ్యం కాదు ప్రేమ ముందు నువ్వు మోకరిల్లాలి ప్రాధేయపడాలి యుగాలి నిరీక్షించాలి అప్పటికైనా దయ తలిస్తే తలుస్తుంది ప్రేమ కరుణిస్తే నువ్వు గెలిచినట్లే ప్రేమ నిన్ను త్రుణీకరిస్తే... తట్టుకొని నిలబడినా నువ్వు గెలిచినట్లే

Thursday, February 19, 2009

నీవు లేని లోకంలొ

నీవు లేని లోకంలొ జీవించగలనా...
నీవు లేని నా జీవితం ఊహించగలనా...
ఈ జన్మలొ నేను నిన్ను చూడగలనా...
మరుజన్మ నాకుంటే నీ తోడై ఉండనా...
కలకాలం నీ కొసం నీ నీడై బ్రతకనా...

చెప్పలేను!విప్పలేను!!

చెప్పలేను మనస్సును విప్పలేను
నా కవితల రూపం నీవేననీ
నా కవితల భావం నీ మదియేననీ
నా కవితలు అంకితం నీకేననీ
చెప్పలేను మనస్సును విప్పలేను

స్నేహం..

కన్నులు కలలను మరచిపోవు...

ఊపిరి శ్వాసను మరచిపోదు...

వెన్నెల చంద్రుడిని మరచిపోదు...

నా మనసు నీ స్నేహన్ని మరచిపోదు...

విరిసిన వెన్నెల కరిగిపోతుంది...

వికసించిన పువ్వు వాడిపోతుంది..

కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది...

వద్దన్నా వచ్చేది మరణం...

పోవద్దన్నా పోయేది ప్రాణం..

తిరిగి రానిది బాల్యం....

మరువలేనిది మన స్నేహం..

కుల మత బేధం లేనిది...

తరతమ భావం రానిది...

ఆత్మార్పణమే కోరుకొనేది...

ప్రతిఫలమన్నది ఎరుగనిది...స్నేహమది

మనిషికొ చరిత్ర

మనిషికొ చరిత్ర అన్నది ఎంత నిజమో
నా మనస్సుకొ చరిత్ర అన్నది అంతే నిజం
మనస్సుకు నచ్చిన వారు నాకు చేరువవ్వరు
నన్ను చేరాలనుకున్న వారికి నేను దూరమవుతాను

సంధ్య వేళ...

సంధ్య వేళలొ చిగురించింది మన స్నేహం
సంద్రపు అలలా వచ్చింది నా కొసం
తలచాను నీతొ మంచి అనుబంధం
ఏ నాటికైన వేచివుంటా నీ కొసం...

Sunday, January 18, 2009

అన్న......

నందమూరిని విశ్వవిఖ్యాతుణ్ణి చేసిన తెలుగు ప్రజల బాధలు గ్రహించి
యార్ధ్ర హ్రుదయము ద్రవించి వారి అభ్యున్నతి కొరకే శేష జీవితమని నిర్ణయించి
మూగబొయిన తెలుగు వానికి అండగ వేయి గొంతుకలు ఒక్కడై నినదించి
రిక్తహస్తాల కాలే కడుపులకు పట్టెడన్నం పెట్టలని పార్టిని స్థాపించి
తారకరాముడై ఆదుకుంటాడని నమ్మిన బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించి
క్త సంబంధం లేకున్న అనుబంధాన్న్ని పంచి తెలుగు జాతికి అన్నగా ప్రేమించి
ష్టం దుఖం ఎవ్వరిదైన తనదిగానే భావించి చలించి దీక్షతొ పరిష్కరించి
రా రాజ్యాన్ని తెలుగు నాట యుగాల తరువాత కళ్ళెదుట పునస్థాపించి
మానవత్వం మూర్తిభవించిన మహామనిషిగా శాశ్వత కీర్తిప్రతిష్టలుగాంచి
రాజ్యాధికారం అంటె ఆదరించిన ప్రజల సేవయని త్రికరణశుద్ధి గా ఆచరించి
న్నతంగా ఆలొచించి, ఉత్తమంగా పాలించి, గతించిననూ ప్రజల హ్రుదయాలలొ శాశ్వతంగా జీవించే..

Tuesday, January 13, 2009

నా రూపం

నిన్ను చూస్తే తెలుస్తుంది....! తొంగి చూసే నింగి, నీ మనసు కన్నా చిన్నదని,
పలకరిస్తే తెలుస్తుంది....! కొకిలమ్మ తీపికుతా....!నీ కమ్మని స్వరమేనని,
ఆస్వాదిస్తే తెలుస్తుంది....!
వీచే పూల గాలీ, నీ వెచ్చని శ్వాసేనని,
చదివి చూస్తే తెలుస్తుంది....! నా ఊహల రచనల్లొ, నిండి ఉన్న రూపం నువ్వేనని....!