Sunday, January 18, 2009

అన్న......

నందమూరిని విశ్వవిఖ్యాతుణ్ణి చేసిన తెలుగు ప్రజల బాధలు గ్రహించి
యార్ధ్ర హ్రుదయము ద్రవించి వారి అభ్యున్నతి కొరకే శేష జీవితమని నిర్ణయించి
మూగబొయిన తెలుగు వానికి అండగ వేయి గొంతుకలు ఒక్కడై నినదించి
రిక్తహస్తాల కాలే కడుపులకు పట్టెడన్నం పెట్టలని పార్టిని స్థాపించి
తారకరాముడై ఆదుకుంటాడని నమ్మిన బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం అందించి
క్త సంబంధం లేకున్న అనుబంధాన్న్ని పంచి తెలుగు జాతికి అన్నగా ప్రేమించి
ష్టం దుఖం ఎవ్వరిదైన తనదిగానే భావించి చలించి దీక్షతొ పరిష్కరించి
రా రాజ్యాన్ని తెలుగు నాట యుగాల తరువాత కళ్ళెదుట పునస్థాపించి
మానవత్వం మూర్తిభవించిన మహామనిషిగా శాశ్వత కీర్తిప్రతిష్టలుగాంచి
రాజ్యాధికారం అంటె ఆదరించిన ప్రజల సేవయని త్రికరణశుద్ధి గా ఆచరించి
న్నతంగా ఆలొచించి, ఉత్తమంగా పాలించి, గతించిననూ ప్రజల హ్రుదయాలలొ శాశ్వతంగా జీవించే..

No comments:

Post a Comment