ప్రేమ- ప్రేమించిన వ్యక్తి నుంచి ఏమైన కొరుకుంటుందా…? ఆశిస్తుందా…?
మన కళ్ళ ముందు ఎన్నొ ప్రేమల్ని చూస్తాం కొన్ని ప్రేమలు పెళ్ళి బంధం తొ ఏకమవుతాయి అంటే ప్రేమ పెళ్లి ని కొరుకుంటుందా?
మరికొన్ని ప్రేమలు ఫలించని పరిస్థితుల వల్ల త్యాగం తొ ముగుస్తాయి. ఆంటే అర్ధం ప్రేమ త్యాగాన్ని కొరుకుంటుందా?
చాల మంది ప్రేమ త్యాగాన్ని కొరుకుంటుంది అంటారు అంటె త్యాగాన్ని కొరుకొని ప్రేమలు నిజమైనవి కావనా?
పెళ్ళితొ ఒక్కటైన ప్రేమలొ పెళ్లి తరువాత కూడా ప్రేమ వుంటుందా? ఉండి తీరాలి కద! ఆందరిలొ అలా ఇంకా ఉంటూనే ఉందా…?
త్యాగం తొ వేరై పొయిన ప్రేమల్లొ విడిపొయాక తనమీద ప్రేమ వుండదా…?
ప్రేమ కొరుకునేది త్యాగమే అయ్యినప్పుడు తను విడిపొయాక తన మీద ప్రేమ భావం వుండకూడదు కదా!
కాని విడిపొయాక ఇంకా తన ప్రేమ భావాల్లొ మునిగిన వారున్నారు కదా…!
మరి ప్రేమ నిజంగా ఏమి కొరుకుంటుంది…?
వేరెదేన్నైనా కొరుకుంటుందా???
Monday, June 21, 2010
Saturday, January 2, 2010
నా ప్రేమ...
తొలి చూపులొ వలిచాను నిన్ను
ఆ క్షణం నుండే మరిచాను నన్ను
నా చిరు మదిలొ పులకింత రేపావు
నా ఎద లయకు రాగానివయ్యావు
వేయ్యి జన్మల ఫలంతొ నీ ప్రేమ పొందిన నాడు
మనసున సంబరాలు అంబరాన్ని అంటాయి నా ప్రేమ అలలు నీ మది తీరాన్ని తాకాయి
ప్రేమ చిన్న అల అయితె ఒక సంద్రాన్ని ఇచ్చేవాడిని
ప్రేమ పచ్చటి ఆకు ఐతె ఒక మహా వ్రుక్షాన్ని ఇచ్చేవాడిని
ప్రేమ ఒక చిన్న గ్రహమైతె ఒక పాలపుంతనే ఇచ్చేవాడిని
నీ పలుకులొ తియ్యదనం,
నీ చూపుల్లొ సూటిదనం
నీ కౌగిట్లొ వెచ్చదనం మరువలేను ప్రతి క్షణం
మన ఊహలతొ ప్రపంచాన్ని చుట్టాం చిరు ఆశలతొ స్వర్గాన్ని మీటాం
కాని తాడు తెగిన గాలిపటం లా... మన ప్రేమ నేలకు ఒదిగింది...
కనుపాప దాటని కల వలె ఎద మడుగులొ ఇంకిపొయింది
కాన లేని కనులెందుకు...?
నీవు లేని ఈ జీవం ఎందుకు...? అనుకున్నా
కానీ
కనులుండేను కలలొ నిన్ను చూచుటకు బ్రతికుండేను నేను నిన్ను చేరుటకు అని ఆశతొ
నీ స్మ్రుతులను ఆక్రుతి గా మలిచి నా మనసును కొవెలగా చేసి ఎల్లప్పుడు నిన్ను ఆరాధిస్తున్నా...
Subscribe to:
Comments (Atom)