Monday, January 7, 2008

పుణ్యం-పాపం

ఏ పుణ్యం చేసుకున్నవొ ఆ జడగంటలు
నీ నల్లని కురులకు జతగా చేరినందుకు
ఏ పుణ్యం చేసుకున్నదొ ఆ ఎర్రటి తిలకం
నీ నుదుటి పై చందమామలా నిలచినందుకు
ఏ పుణ్యం చేసుకున్నదొ ఆ నల్లని కాటుక
నీ నయనాల చెంత ఉన్నందుకు
ఏ పుణ్యం చేసుకున్నవొ ఆ గల గల మనే గాజులు
నీ మ్రుదువైన హస్తాలను తనలొ దాచుకున్నందుకు
మరి ఏ పాపం చేసుకున్నదొ నా చిన్ని మనస్సు
నీ మనస్సు చేరనందుకు .....

No comments:

Post a Comment