Friday, January 18, 2008

నందమూరి తారకరామా...!

నందమూరి తారకరామా!
నవరస నటనా సార్వభౌమ!
చిత్రసీమ నభస్సులొ మెరిసిన
హరి చాపం నీ రూపం!
చిత్రసీమ సరస్సులొ విరిసిన
అరవిందం నీ అందం!
తెలుగు నాడు ఆరాధించిన
శ్రీరాముని రూపం నీది!
తెలుగు వాడు ఆస్వాదించిన
శ్రీక్రుష్ణుని తత్వం నీది!
రాజసం మూర్తిభవించిన రారాజువై
పౌరుషం ప్రజ్వరిల్లిన రావణ బ్రహ్మవై
భీకరాకారం తొ గర్జించిన భీమసేనుడవై
శివతాండవం శివమెత్తిన నిజలాక్షుడవై
గ్రీష్మ తేజస్సు తొ విక్రమించిన భీష్ముడవై
స్వామిభక్తి కి సంకేతం గా నిలచిన కర్ణుడవై
తెలుగుతేజం పరవశించిన క్రుష్ణరాముడవై
లొకానికి విజ్ఞ్ణానం వెదజల్లిన వీరబ్రహ్మవై
ఏన్ని పాత్రలలొ జీవించినావొ
ఎంత వైవిధ్యం చూపించినావొ
పట్టిన పట్టు సాధించే,నీ సాహసం వజ్రసంకల్పం
చేపట్టిన కార్యం సాగించే
నీ రాజసం రాజకీయ శిల్పం
మొన్న:
తెలుగు తెర పై కధానాయకుడవు
నిన్న:
తెలుగు ధర పై ప్రజానాయకుడవు
నేడు:
తెలుగు జాత్తి కి స్పూర్తి ప్రదాతవు
తెలుగుదేశం - నీ ఆవేశం !
భారతదేసం - నీ ఆదర్శం!
వెలుగు కొసం - నీ సందేశం!
పొంగి వచ్హె స్వాభిమానం - నీ సిరి
సమస్త ప్రజా సంక్షేమం - నీ వూపిరి

No comments:

Post a Comment