నీకు నాకు మధ్య మాటల వంతెన నిశ్శబ్ధం గా కూలిపొయింది,
మౌనం పెరిగింది అపార్ధాల అగాధం పున:నిర్మాణ ప్రయత్నం లొ
ఎన్నొ వేల మెట్లు దిగి నీకై ఈ చివరి ప్రయత్నం
కొన్నిసార్లు మౌనం జీవితకాలపు ప్రశ్నల్ని మిగిల్చేస్తుంది
పెనవేసుకొవాలనుకున్న పవిత్ర బంధం పరిధులను నిర్మించుకుంది
నువ్వు వస్తావని నేను, నేను పిలుస్తానని నీవు…
ఒకే ఒడ్డున ఎవరికి కాకుండా నిలుచున్నాం
అడిగితె చెబుదామని నేను, చెబితె విందామని నీవు…
మనిద్దరి మధ్యన అహం అడ్డుగొడలు నిర్మించుకున్నాం
ఒక్కసారి చూడు, నా కళ్ళలొకి, సప్త సముద్రాలు కనురెప్పలమాటున…
ఒక్కసారి విను, తప్పొప్పుల బేరీజు నడుమ సతమతమయిన
మనసు మూగవేదనను మౌనం అంతా మాటలుగా మారి
గుండె లొతుల్లొ గొంతుకను దాచేసింది.
ఒక్కసారి పలుకరించి చూడు వెల్లువలా నిన్ను ముంచెత్తుతుంది.
కనురెప్పల మాటున దాగిన స్వప్నం రూపం చూసిందెవరు?
అందుకే ఆవేదనను ఇలా నివేదన చేస్తున్నాను.
నా కళ్ళ వాకిళ్ళలొ స్వప్నాల తోరణాలు కట్టి వేచి వున్నాను
నువ్వు వస్తావని...
నా మనసు ముంగిట్లొ ఆశల రంగవల్లులు దిద్దాను
సంక్రాంతి వెలుగులు తెస్తావని...
“ఫ్రేమ వున్నచొట భాధ్యత బరువు కాదు”
No comments:
Post a Comment