Sunday, November 11, 2007
స్నేహం...
గానం కంటే మధురమైనది
వెన్నెల కంటే చల్లనైనది
ప్రాణం కంటే ముఖ్యమైనది
స్నేహం ఎంతొ విలువైనది...
కరిగిపొనిది రాగం
చెదిరిపొనిది చిత్రం
మరుపురానిది గానం
మరిచిపొలేనిది స్నేహం
చూస్తే కాని తెలియనిది
మండే మంటకు కరగనిది
ప్రేమకు మాత్రం తెలిసినది
స్వార్ధం అంటూ ఎరుగనిది స్నేహం ...
తపస్సు చేస్తేనే ప్రత్యక్షమవుతుంది దేవత
పుణ్యం చేస్తేనే లభిస్తుంది స్నేహం ....
కాలమా !ఆగిపొకు ఆశలు తీరే వరకు
మేఘమా !వెళ్ళిపొకు వర్షం కురిసేవరకు
మైనమా ! కరిగిపొకు జ్యొతి వెలిగేవరకు
స్నేహమా ! చెదిరిపొకు నేను ఉండే వరకు ...
పువ్వు వికసించేది పూజ కొసం
నేడు అంతరించేది రేపటి కొసం
సూర్యుడు అస్తమించేది చంద్రుని కొసం
కాని నేను జీవించేది నీ స్నేహం కొసం ...
Tuesday, October 30, 2007
చెలీ నీకోసం...
నీ మాటలు వినిపించాలని...
వీచే గాలిని సైతం ప్రేమిస్తున్నా...
నిను తాకి నను చేరుతోందని...
పగటిపూట కూడా నిద్ర పోతున్నా...
స్వప్నంలో నిను చూడొచ్చని...
నీ పాద స్పర్శ తగిలిన నేలను చూచి ఈర్ష పడుతున్నా...
ఆ భాగ్యం నాకు కలగలేదని...
అయినా ఏమీ చేయలేక నిస్సహాయంగానే నిల్చున్నా...
ఎందుకంటావా...
నిను చూచినవేళ నా మాట మౌనమవుతుంది...
చూపులకే తప్ప దేహంలోని మరే భాగానికి చలనం రానంటుంది...
అయినా హృదయాన్ని వీడిపోని ఆశ మాత్రం నిను చేరాలని తపిస్తూనే ఉంటుంది...
నిను చేరే భాగ్యం ఏనాటి కలిగేనో అని వేచి చూచే నా చిన్ని హృదయానికి ఏమని చెప్పను...
దాని ఆశను నెరవేర్చే ధైర్యం నాకు లేదని...
చెలి నయనాల వెంట...
అల్లరిగా నా చూపును తాకి...
పులకింతలు మరచిన మదికి గిలిగింతలు నేర్పించి...
మనసు దోచిన ఆ నయనాల వెంట పయనానికి సిద్ధమయ్యాను.
నీ తలపుల సంద్రంలో మునిగిపోతున్నా...
తీరమెరుగని నావలా మానస సంద్రంలో
దిక్సూచీని వెదుకుతూ...
ప్రేమ చుక్కానికై పరితపిస్తున్నా
పచ్చని పచ్చిక బయళ్లు
వెచ్చని ఊసుల లోగిళ్లు
నా గుండె గది తలుపును తడుతుంటే
నీ రాకకై నిరీక్షిస్తున్నా
ఆమనికై వేచి చూసే కోయిలలా....
నువ్వు వస్తావని...
నా హృదయవీణపై ప్రణయరాగాలను
పలికిస్తావని వేచి చూస్తున్నా
వస్తావు కదూ...
ఏమని వర్ణించనూ...
నిన్ను వర్ణించుదామంటే,
పదాలకు అందని భావానివి నువ్వు
నీ ముగ్ధ మనోహర సౌందర్యం...
నీపై నాకు గల ప్రేమతో పోటీ పడుతోంది
ఇదంతా మాటల మణిహారంలో కూర్చుదామంటే...
నీ ప్రేమ తపస్సులో మాటలు మౌనంగా మిగిలిపోయాయి
ఏమని పిలువను?
ఏమని పిలువను...
మనసు అలజడితో ఊగుతున్నప్పుడు..
నమ్మిన విశ్వాసం ఆ విశ్వాసం సాక్షిగా చెదురుతున్నప్పుడు..
బ్రతుకు ప్రశ్నార్థకమై చౌరస్తాలో నిలిచినప్పుడు..
నేనున్నానంటూ పలకరించావు
నీకు నువ్వు నాకు నేను అంటూ
మనం పాడుకునే చెణుకును గుర్తు చేస్తూ..
ప్రపంచం సాక్షిగా..
మనం నడకను కొనసాగిద్దామంటూ...
మనిషితనం మన పునాదిగా చేసుకుందామంటూ...
నువ్వొచ్చావు.
ఆశాజీవనలతలను మోసుకుంటూ నువ్వొచ్చావు..
సెలయేటి పాటలా నువ్వొచ్చావు..
నువ్వూ నేనూ లేని జీవితం..
నీకూ నాకూ లేని జీవితం..
జీవితం కాదంటూ
నువ్వొచ్చావు...
సువిశాల జగతిలో మనిషికి ఎంత చోటు కావాలంటూ...
ఎందుకు జీవించలేమంటూ...
ఒక పురావిశ్వాసాన్ని తలపుకు తెస్తూ...
నువ్వొచ్చావు..
జనజీవన సంస్కృతులను
కళ్లముందు ఆవిష్కరిస్తూ...
ఇన్నాళ్లుగా.. మనిషి సాగిస్తున్న
సహస్ర వృత్తుల శ్రమజీవిత పాఠాలు నేర్పుతూ..
నువ్వొచ్చావు...
ప్రియతమా....
ఏమని పిలువను?
నిన్ను ఏమని పిలవను?
మనసు పలకరింపు...
మలయ సమీరంతో మంద్ర మంద్రంగా
హొయలు హొయలుగా
కోటి ఊసులను మోసుకొస్తూ...
నువ్వొస్తావు..
మండువేసవిలో పండువెన్నెలలా
వలపు పరిమళాలకు చిరు రాగాలను చేరుస్తూ
కోయిల కుహుకుహూలకు శ్రుతి సరిచేస్తూ
రతీ మన్మధంలాగా...
నువ్వొస్తావు
భావం, రాగం, తానం,పల్లవి
అన్ని తానైన ప్రణవనాదంలా
మంత్రజగత్తు సరిహద్దులను
సుతారంగా మీటుతూ
వెయ్యి వసంతాల చంద్రోదయంతో..
నువ్వొస్తావు
నువ్వూ నేనూ సంగమించే క్షణం...
నువ్వూ నేనూ ప్రణవించే క్షణం..
నువ్వూ నేనూ వూసులల్లుకునే క్షణం..
ఎదురుచూస్తూ నేను..
జాటాజూటధారి వదిలే గంగా ఝరిలా నువ్వు..
నువ్వొస్తావు...
అమరనాదాలను మోసుకొస్తూ..
నువ్వొస్తావు..
మనసు పడే మూగవేదన...
అమ్మాయిల మదిని దోచుకునే చందమామ..
పారిజాత పుష్పాలను ఏరుకునేటప్పుడు
గాలి రేపే మలయ పరిమళం.
అపార్థం, అపనమ్మకం తోడయితే..
వెయ్యి ఆశలు కుప్పగూలితే
సముద్రపు రెల్లుదిబ్బపై
రెపరెపలాడే గడ్డిపోచలు గుర్తొస్తాయి
ఎందరు ఎన్ని రాగాలు పలికినా సరే
ఎందరు ఎన్ని గుండెకోతలు కోసినా సరే...
మనసు గాయం తీరేది కాదు.
మనసా... నీకో ప్రశ్న ?
మనిషికి తప్పదా నీతో నిరంతర సమరం
అందమైన ఆశల్ని ఆనందంగా రేపి...
తపించే మనిషిని చూచి వెక్కిరింతల కేరింతలు కొట్టే నీకు తెలియదు సుమా...
ఆ మనిషే ఓడిననాడు కలిగే అపజయాల గాయాలు భరించాల్సింది నీవేనని.
ప్రేమించడం తప్పా... ?
తలపుల్లో నిలిచి మనసు తలుపులు తెరిచావు...
ఎవరిలేని ఒంటరి పయనంలో నీకు తోడు నేన్నావు...
కంటనీరు చిందినవేళ నేనున్నానంటూ ఓదార్పు నిచ్చావు...
మోడువారిన జీవితంలో వసంతాలు పరిచయం చేశావు...
జీవితమంటే అర్ధం చెప్పి ఎనలేని ధైర్యానిచ్చావు...
అర్ధం లేని జీవితానికి నీవే పరమార్థమయ్యావు...
అంతలోనే ఏమైందని అలా దూరంగా వెళ్లిపోయావు...
కలనైనా నినుచూడక ఉండలేని నన్ను ఎందకు కాదన్నావు...
నీవు నాపై చూపిన అభిమానాన్ని ప్రేమనుకోవడం తప్పునుకున్నావు...
నా దానివే కావాలనుకున్న నా కోరికను ఆదిలోనే తుంచేయాలనుకున్నావు...
నాపై నీకు ప్రేమలేకుంటే ఇదంతా ఎందుకు చేశావు...
ప్రేమే నేరమనుకున్న నీవు ఆ ప్రేమను నాకెందుకు పరిచయం చేశావు...
చెప్పు ప్రియా... ప్రశ్నిస్తేనే జీవితమన్నావు... నా జీవితం కోసం నేడు నిన్ను ప్రశ్నిస్తున్నాను... నా ప్రశ్నకు బదులివ్వగలవా... ?
నువ్వు వస్తావని...
ఆశ చావని నా ప్రాణం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.
ఎవరెన్ని చెప్పినా వినని మూర్ఖుడిలా...
నా మనసు నీకోసమే తపిస్తూ ఉంటుంది.
భూమి ఆకాశాలు ఒకటైనా సాగరాలన్నీ ఏకమైనా...
నిను వలచిన నా హృదయం నీకోసమే వేచి ఉంటుంది.
నీకోసం...
గుండెలనిండా ప్రేమతో నీ వెనకే వస్తున్నా...
నిత్యం నీవువెళ్లే గుడిలోని పూజారినీ వేడుకుంటున్నా
హారతి పళ్లెంలో నువ్వు వేసే కానుకను నాకివ్వమని...
అన్నీ నీకోసం చేస్తున్నా... కాదు కాదు నాలో నిలిచిన నీకోసం చేస్తున్నా...
కానీ నీకోసం ఉన్న నాకోసం మాత్రం నీవేమీ చేయవు...
అయినా నీన్నేమీ అడగను ప్రియా... చివరకు నను ప్రేమించమని కూడా...
ఎందుకంటే నీకు నచ్చనిదేదీ నేను ఎన్నటికీ చేయను.
ప్రేమ సామ్రాజ్యంలో...
నా ప్రతి అడుగు నీకోసం...
నాలోని ప్రతిశ్వాస నీకోసం...
నాలోని ప్రతి అణువూ నీకోసం...
నే బ్రతికున్నది నీకోసం...
నే బ్రతుకుతున్నదీ నీకోసం...
నా నీరీక్షణ నీకోసం...
నే పడుతున్న తపన నీకోసం...
నాలో జ్వలించే ఆవేదన నీకోసం...
నేను ఇప్పటికీ ఎదురు చూస్తున్నది నీకోసం...
కొడిగడుతున్న నా ప్రాణం నిలుచున్నది నీకోసం...
మరణం సైతం నావద్దకు రాకున్నది నీకోసం...
కాదని నీవు నన్ను వదిలేస్తే (నే) మరణిస్తా నీకోసం.
ఎమిటిది నేస్తం...
మనసు లోతుల్లో ముల్లువై గుచ్చేస్తావు
నా మనసు రాజ్యానికి రాణిలా అనిపిస్తావు
పరిపాలించ రమ్మంటే కాదని గెంటేస్తావు
ముద్దబంతి పువ్వులా ముద్దొస్తావు
ఓరకంట చూస్తేనే మందారంలా కొపగించుకుంటావు
మౌనంగా ఉందామంటే రాగమై వినిపిస్తావు
సందడి చేద్దామంటే సమయం లేదంటావు
వద్దనుకుందామంటే వలపులు పంచే దేవతలా కనిపిస్తావు
కోరి వద్దకు వస్తే కోపంగా చూచి పొమ్మంటావు
సాయం సంధ్యవేళ వీచే గాలి తెమ్మెరలా నా మది దోచేస్తావు
మనసు మౌనం కరిగేవేళ వడగాలివై ఉక్కిరిబిక్కిరి చేసేస్తావు
చెలీ వింటున్నావా...
తొలకరి తాకిన పుడమిలోని కమ్మదనం...
మంచువేళ తూరుపున విచ్చుకునే వెలుగురేఖల నులివెచ్చదనం...
సాయం సంథ్య వేళ చల్లగా తాకే పిల్లగాలిలోని చిలిపితనం...
ఊసులు చెప్పే నీ స్నేహంలోని మాధుర్యం...
నాకెపుడూ మధురానుభూతులే.
చిలిపి చూపుల కాంతిలో...
ఎప్పుడో మర్చిపోయిన నన్ను నేను కనుగొన్నాను.
చెక్కిలి దాటని ఆ నునులేత సిగ్గు దొంతరలో
నా చెలి...
నిన్నే అరాధిస్తూ
నీ శ్వాసలోశ్వాసనై
నీ ప్రేమకే తపించే
నా ప్రేమను తెలుసుకో
నా మనసును తెలుసుకో
నువ్వు ఎదురుగా వస్తే అగలేను
దగ్గరగా ఉంటే మాట్లాడలేను
పక్కగా వెళుతుంటే చూడకుండా ఉండలేను
మరి నా ప్రేమను ఎలా తెలుపను?
నా శ్వాసవు నీవేనని ఎలా చెప్పను?
నా అశవు నీవేనని ఎలా తెలుపను?
నా గుండె గుడిలో దేవతవని ఎలా చూపను?
చెలీ కరుణించవా... ?
చూస్తున్న వేళ...
నీకు చిక్కిన నా చూపుల కాంతిలో
కన్పించలేదా ఏ భావం ?
తడబడి తల తిప్పుకున్న నాలో వినిపించలేదా
నీకే పలికే ఏ మౌనరాగం ???
చెలీ నీవుంటే...
నీ నవ్వుల సవ్వడిలో కోయిల రాగాలు వినిపిస్తాయి.
నీ సానిహిత్యంలో వసంతాలు దరికొస్తాయి.
నీ కోసం నిరీక్షణలో యుగాలు క్షణమవుతాయి.
నీ తలపుతోటి మనసుకు రెక్కలొస్తాయి.
నీ పిలుపుతోటి మది భావాలు వెలికొస్తాయి.
నీవుంటే నాకు విజయాలు వరిస్తాయి.
నీవంటూ లేకుంటే అపజయాలు వెక్కిరిస్తాయి..
చెలీ నీలో...
విరజాజుల పరిమళాలు నీ మాటల్లో
లేత కిరణాల ఉషోదయాలు నీ చూపుల్లో
దొర్లి పడేను ముత్యాలు నీ పలుకుల్లో
అందుకే చెలీ నే బ్రతికేస్తున్నా నీ తలపుల్లో...
నీలో నేనై...
నీ సమస్యలకు ఓదార్పు నేనై నీ మదిని శాంతింపజేస్తాను
నీ మనసులో చేరిన ఆనందం నేనై నిన్ను ఉత్సాహపరుస్తాను
నీ పెదవులపై విరేసే చిరునవ్వుల హరివిల్లు నేనై జీవితంలో రంగులు విరబూయిస్తాను.
నీ జీవితంలోని ప్రతీక్షణం నిను అల్లుకునే తీగను నేనై జీవితాన్ని కాంతిమయం చేసేస్తాను.
ప్రేమ లోకంలో
కెరటమై వచ్చి నను చేరుతావని...
ఎడారి నేలనై ఎదురు చూస్తున్నా...
దాహం తీర్చే చిరు చినుకై నాకు ప్రాణం పోస్తావని...
గుడి గంటనై స్థబ్ధుగా ఉన్నా...
చిరుగాలివై వచ్చి నాతో రాగాలు పలికిస్తావని...
ఆనందం చిగురులనెరగని శిశిరమై వేచి ఉన్నా...
వసంతమై వచ్చి కొత్త లోకానికి నను తీసుకెళ్తావని...
నీవే ఆశగా... నీ తలపులే ప్రాణంగా... బ్రతికేస్తున్నా...
ఏనాటికైనా నువ్వు నన్ను చేరుతావని...
న్యాయమా ప్రియతమా... ?
నేనెరగని నన్ను నాకే కొత్తగా చూపించావు
చేతికందని నింగిలోని తారల్ని నవ్వుతూ దోసిళ్లలో పోశావు
సరసమైనా తెలియని మనసుకు విరహాన్ని రుచి చూపించావు
మాధుర్యం తెలియని జీవితంలో వసంతాలు రప్పించావు
అన్నీ తెలిశాక మాత్రం అందనంత దూరాన నిలిచావు.
నా తలపుల్లో నీరూపం
నా స్మృతుల సెలయేటిలో ఎగసిపడిన ఆనంద తరంగం మనసులోనే నిక్షిప్తమైంది
నిను చూచిన ఆ ఒక్క క్షణం కలయా అని నేననుకుంటే... కాదు నిజమేనంటూ మది చెబుతోంది
నిజమేననుకుని సంబరపడదామంటే జరిగిందంతా కలలా అనిపిస్తోంది
నిను చూచిన ఆ మధురక్షణం కలయా... నిజమా తెలియక సతమతమయ్యే నాకు...
నిజమై కనిపిస్తావో కాదని కలలాగే మిగిలిపోతావో నీ ఇష్టం.
నీ ప్రేమ
నేను కరిగిపోవాలీ
నీ కన్నుల నీడలలోనా
నేను నిలిచి ఉండాలీ
మేఘాలెన్నో ముసిరినా
రవి ఉదయించక మానునా
హోరున గాలునెన్నో వీచినా
మెరిసే తారలు రాలునా
ఎదురు నిలిచినా
వీడిపోదు మన బంధం
యుగాలెన్నో గడచినా
జన్మలెన్నో ముగిసినా
తారల అంతరాలు
ఎన్ని మారినా
నిన్ను వీడదు
నా హృదయం
నిశీధి రాత్రిలో తొలి కిరణం నీవు...
ఎడారి పయనంలో నీటి చెలమ నీవు...
శిశిరంలో అరుదెంచిన వసంతానివి నీవు...
అర్థమెరుగని జీవితానికి పరమార్ధం నీవు...
నేనంటూ ఉన్నానని చెప్పింది నీవు...
నాలోని ప్రతి తలపుకు ప్రారంభానివి నీవు...
నా ఒంటరి జీవితంలో తొలి నేస్తానివి నీవు...
ఇన్నాళ్ల నా ఎదురుచూపుకు అర్థం నీవు...
నాకు మాత్రమే కనిపించే సరికొత్త రూపానివి నీవు...
అన్నీ నీవు... అంతటా నీవు... నాలోని ప్రతి అణువూ నీవు...
నాలో చలనాన్ని రగిలించింది నీవు...
కానీ నాకు మాత్రం ఏమీ కావు...
నీ తలపుల్లో
నీ చూపుల్లో ఉషోదయాలు కనిపిస్తాయి
నీ అందెల సవ్వడిలో సప్త స్వరాలు వినిపిస్తాయి
నీ పాద స్పర్శతో కఠిన రాళ్లు సైతం పులకిస్తాయి
నీ పరిమళం సోకినవేళ ఎండిన వృక్షాలు చిగురిస్తాయి
నీ పలుకుల్లోని భావాలు కోయిల గానాలను మరిపిస్తాయి
నీకోసం వేచిన వేళ క్షణాలు యుగాలవుతాయి
నీ సానిహిత్యంలో యుగాలు సైతం క్షణాలవుతాయి
నీతో సాగే పయనంలో ఎడారులు కూడా వనాలవుతాయి
అందుకే... చెలీ నీవంటూ లేకుంటే నా బ్రతుకుకి అర్థం లేదంతే...
చెప్పవా... ఒక్కసారి
ఏమి చెప్పావు నా మనసుకి... నాకేమాత్రం తెలియకుండా...
ఏ మంత్రం వేశావు నామదికి... నీవు తప్ప మరో ఆలోచన లేకుండా...
ఏ మాయ చేశావు నాలోని తలపులకి... నిత్యం నీ ధ్యాసే తప్ప మరేదీ రాకుండా...
అన్నీ నువ్వు చేస్తావు... కానీ నా మాట మాత్రం పట్టించుకోనంటావు...
ప్రేమంటే ఆట నీకు... కానీ నీతోటి ప్రేముంటేనే జీవితం నాకు...
Sunday, October 7, 2007
అమెరికా.......
ఆప్యాయతా పలకరింపు లేదు
ఆదుర్దాగా అక్కున చేర్చుకునే ఆత్మీయత లేదు
నిద్రలొ కలవరింతలకు,పలవరింతలకు
అమ్మ కళ్ళ చెమరింపు లేదు
నేనున్నాననే తోడు లేదు,నావాళ్ళనే భద్రత లేదు
ఆర్తిగా ఆదరింపు లేదు
బుజ్జగించి తినిపించే మమకారం లేదు
అమెరికాలొ వారి వెతలు
ఇంట్లొ తల్లిదండ్రుల భాధలు
దూరమవుతున్న బంధాలు
మాయమవుతున్న మమకారాలు
నీరు కారుతున్న విలువలు
శూన్యమవుతున్న మనసులు
పెరుగుతున్న డబ్బులు
తరుగుతున్న బంధాలు
త్రిశంకు స్వర్గం లాంటి చదువులు
వెరసి అమెరికా బ్రతుకులు కలకల
తల్లిదండ్రుల మనస్సులు విలవిల
Friday, August 10, 2007
నా దేవత..
నువ్వు నా నీడవు కావు, చీకటి లొ నిన్ను వదిలేయడానికి..!
నువ్వు నా కళ్లలొ ఉండవు, నా కన్నీటి చుక్కవై జారిపొవడానికి..!
నువ్వు నాకొచ్చే కల కాదు, మెలకువ రాగానే చెదిరిపొవడానికి..!
నువ్వు నేను పీల్చే శ్వాసవు కాదు, పీల్చుకొని వదిలివేయడానికి..
నువ్వు నా హ్రుదయం..! నాతొనే ఉంటావు...
నువ్వు కొట్టుకొవడం ఆగిపొతే నేను అక్కడితొనే అంతమైపొతా బంగారం...
నిజం గా నేను తప్పు చేసి ఉంటే క్షమించు..
నా దేవత దగ్గర నన్ను క్షమించమని అడిగే హక్కు నాకు లేదా.. ఐనా క్షమించే అంత పెద్ద మనస్సు నీకు లేదా..!
మళ్ళీ నీ మాట కోసం, నీ రాక కోసం, నీకై నా చిన్ని హ్రుదయం ప్రతీ క్షణం వేచి చూస్తుంది..!
వచ్చేయ్ బంగారం... మళ్ళీ నా జీవితం లోకి.
Love you Ever.. Forever
Monday, June 25, 2007
"ప్రేమ ప్రయాణం"
ఊహించని స్నేహం కలిసింది
ఊహలకందని బంధం వేసింది
తెరచి చూపమంది ఎదలోని భావాలను
పంచి పెట్టమంది మనస్సులోని స్నేహమాధుర్యాన్ని
కులమతాల కట్టుబాట్లను త్రెంచేయమంది
పెద్దల పంతాలను ప్రక్కకు నెట్టేయమంది
అంతస్థుల అగాధాలను దాటేయమంది
రెండు గుండెల చప్పుడు ఒక్కటేనంది
చేయి చేయి కలపమంది
నాకు నీవు నీకు నేను సాయమంది
ఒకరికొకరు తోడుగ కలిసి సాగమంది
అది "ప్రేమ ప్రయాణమే" అంది
Thursday, June 7, 2007
భగ్న హ్రుదయం ....
నిలుచున్నాను
ఎందరికొ నీడనిచ్హాను...
మరెందరికొ నన్ను అర్పించుకున్నాను
నేనివ్వడమే కానీ,...నాకేమైన ఇచ్హిన వారు లేరు?
నాకు మనస్సు వుంది ,దానికీ స్పందించే హ్రుదయం వుంది
ఎవరొ ఏదొ చేస్తారని ,ఏవొ ఇస్తారని
నేను ఆశించలేదు
అలంకారాలు అడగలేదు...
అడంబరాలు నేనొర్వలేదు...
పిలిస్తే పలికాను...
పిలవకున్నా పలికాను
స్నేహమే కొరుకున్నాను...
అదే నేను చేసిన నేరమా..?
ఇదే నా భగ్న హ్రుదయం
(ఫర్వాలేదు నా జీవితం ఇలా సాగిపొనీ)