Monday, December 15, 2008

అన్న

"అమ్మా" అనే మాటలొ రెండు అక్షరాలు
"నాన్నా" అనే మాటలొ రెండు అక్షరాలు
అమ్మ లొని సగమై
నాన్న లొని సగమై
అమ్మ లొని ఆలన
నాన్న లొని పాలన
ఒక్కటై కలిసేదే "అన్న"బంధం
"అన్న" అంటే అమ్మకు ప్రతిరూపం
"అన్న" అంటే నాన్నకు ప్రతిబింబం

Monday, December 8, 2008

నా ప్రాణానికి

ఇది నిజమా?
నువ్వు నా దానివి కావా?
నీ మలినం లేని మనసు.. నీ ముత్యాల్లాంటి మాటలు.. చిలిపి నవ్వులు.. చిరు కొపాలు.. ఇవేమి నావి కావా? నీ అందమైన అమాయకత్వం.. నీ చుడ చక్కని రూప లావణ్యం..వేరొకరి సొంతమా?
"నువ్వు నాదానివి కాదు!" అనే నిక్రుష్టమైన నిజం ఓ అందమైన అబద్దం అయిపొవాలని అని అనుక్షణం పరితపిస్తున్నా.."నువ్వు నమ్మలేకపొయినా ఇది నిజమేరా!" అంటూ ప్రతి నిముషం నా పిచ్చి మనసు పదే పదే గుర్తు చేస్తుంది. నా ప్రాణం గా, నా ప్రపంచం గా భావించిన నిన్ను నేను కొల్పొతున్నాననే నిజాన్ని విని ఎలా తట్టుకొవాలొ తెలియటం లేదురా! నా వాకిలిలొ రంగవల్లులు వేసే రాణివి.. నువ్వు నా కౌగిలిలొ కరిగిపొయే జాబిల్లివి కాదన్న విషయం ఎలా మర్చిపొమ్మంటావు చెప్పు! మువ్వలా మనస్సు లొ సందడి చేస్తావు అనుకుంటే.. గుండెల్లొ కట్టిన గుడిని వదిలేసి గగనం లొ రివ్వున ఎగిరిపొతే ఎలా నేస్తం? ఎన్నెన్నొ రంగుల కలల్లొ విహరించిన నాకు ఇప్పుడు భవిష్యత్తు ఒక భేతాళ ప్రశ్నలా మిగిలింది. నువ్విలా బాధిస్తుంటే జీవితం లొ నేనేమి సాధించగలను చెప్పు! అందుకేనేమో బ్రతుకంతా అంధకారంగా కనిపిస్తుంది,అయిష్టంగా అనిపిస్తుంది!!
ఒక్క విషయం లొ మాత్రం నాకు నిజంగా ఈర్ష్యగా ఉంది. నీ కొసం వేచి చూడకపొయినా,నిముషానికి నాలుగు వేల సార్లు నిన్ను తలచుకొకపొయినా, నిన్నే స్మరిస్తూ నిద్రలేని రాత్రులెన్నొ గడపకపొయినా, కలలొ కూడా నీ పేరే పిచ్చిగా జపించకపొయినా,నాలాగా నిన్ను ఇష్టపడకపొయినా, నాలాగా నిన్ను అభిమానించకపొయినా, నాలాగా నిన్ను ఆరాధించకపొయినా, ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించకపొయినా.. నిన్నటి వరకు నీతొ ముఖ పరిచయం కూడ లేని ఓ వ్యక్తి నిన్ను సొంతం చేసుకొబొతున్నాడు అని తెలిసి అతని అద్రుష్టాన్ని చూడలేక నా మనస్సు నిజం గా ఈర్ష్యపడింది. నేను ఓడిపొతాను అని తెలిసినా నా మనసు నీ మనసుని గెలుచుకొవాలని అనుక్షణం ఎంతొ పొరాడింది,ఆరాటపడింది! కాని ఫలితం మాత్రం ప్రతికూలమయ్యింది.నిన్నుకొల్పొతున్నాననే బాధ పడుతున్నా.. నా ఓటమిలొ ఏదొ తెలియని చిన్న సంతొషం! ఒకప్రక్క కొంచెం గర్వం కూడా! బహుశా నాకూ స్పందించే హ్రుదయం ఉందని మొదటిసారిగా తెలిసినందుకేమో!
ఓ తియ్యని జ్ఞాపకం లా మిగిలిపొతావొ.. జాబిలిలా జీవితాంతం వెంటపడతావొ తెలియదుకాని..! ఓ విషయం మాత్రం నా మనస్సాక్షిగా చెప్పాలనుకుంటున్నాను,అది...
"ఐ మిస్ యు మై స్వీట్ హార్ట్..."

 ఊపిరి కూడా భారంగా ఉంది 

నువ్వు నాకు దక్కవని తెలిసినప్పుడు


ఊపిరి ఆడకుండా చేస్తున్న

నీ జ్ఞాపకాలు నా నుండి దూరం కాలేవా 

సఖి

Sunday, November 2, 2008

స్నేహమా...స్నేహమా...

చిరుగాలిలా నీవు రావాలి
జడివానలా నన్ను తడపాలి
స్నేహమా...స్నేహమా...
నీవే నాకొక చిరువరమా...
అందమైన చందమామలా నన్ను నీవు మురిపావే
అందీ అందని పందు వెన్నెలలా నన్ను నీవు తడిమావే
చక్కని చుక్క... కౌగిలివై
కలువల్లాంటి కళ్ళను చూసి పడిపొయానే నీ వలలొ
అమ్రుతమిచ్హే నీ పెదవులలొ కలవాలని నీ వలపులలొ
సుందరరూపమై ... మమతల శిల్పమై
చేరావే నా ఎదలొ
ఓ స్నేహమా...
కిల కిల నీవు నవ్వాలి
గల గల నీవు ఆడాలి

Saturday, June 21, 2008

ఓ ఫ్రియా

ఓ ఫ్రియా,
లేత తమలపాకుల్లాంటి నీ పాదాలకి,
నీ లేత  రక్తమే సింధురమై లయబద్దంగా చిందులేస్తూ,
దంతాల్లా మెరిసే నీ పాదాలు చూసిన క్షణాన
నాలొ మొహం పెరిగింది, నా మనసు కరిగింది

కన్నీటి సంద్రం

కన్నీటి సముద్రం లొ నన్ను విడిచి వెల్లిపొతున్నావా
ఇది ఓ కలలాగ భావించి జీవించమంటున్నావా
నీ నవ్వులలొనే కాదు నీ కన్నీల్లలొ కూడా
నీ సంతొషం లొనే కాదు నీ దుహ్ఖం లొ కూడా
నీతొనే వుంటాను చెలియా... నన్ను నమ్మవా...
నువ్వు అంటే ఇష్టమంటావ్ కాని ప్రేమ లేదంటావ్
కాని నేను నీ ప్రేమకొసమే తపిస్తున్నాను అని అర్ధం చేసుకొవు
నిన్ను స్నేహితురాలిగా పొందానన్న సంతొషం కన్నా
నీ ప్రేమ పొందలేకపొతున్నానన్న బాధ నన్ను తరుముతుంది

తను

తన సుమధుర దరహాసంతొ- తొలి చూపులొనే నా మది దొచిన
తన రూపం ఈ స్రుష్టి కే ప్రతి రూపం

తన పెదవులపై చిరునవ్వు  - ఓ అందమైన గులాబీ పువ్వు
నవరసభరితమైన తన ముఖ సౌందర్యం వర్ణనాతీతం

తనే నా హ్రుదయ రాణి  -  తనే నా ప్రేమ వాణి
తను లేని జీవితం నరకం  -   తనే నా జీవిత మారకం

తను ఎప్పటికైనా వస్తుందని  -  నా ఆశ ఫలిస్తుందని
ఫ్రతి నిముషం ఒక యుగంలా గడుపుతున్న ఈ ప్రేమికుడిని కరుణించవా ఇకనైనా…

Friday, June 20, 2008

నువ్వేనా... నీ తలపులేనా...

చిరుగాలి సవ్వడిలొ నేను విన్న సంగీతం నీ పలుకులేనా…?
మదిలొ రేగె అలజడులకు కారణం నువ్వేనా…?
కంటిపాపగా దాచుకున్న నీరూపం కన్నుల ఎదుటకు రాదేలా…?
నిన్ను చూడాలని ఆశ పడే ఈ పిచ్చి మనసు చేసే గారడీని ఆపేదెలా…?
నాలొని ఊసులను నీ చెవిలొ గుసగుసగా చెప్పాలని ఈ తపనేలా…?
నీ రాక కొసం ఎదురు చూసి అలసిపొయిన నా కలువ కన్నులకు నిద్ర కరువయ్యి…
అనుక్షణం నీ ఆలొచనలతొ నా హ్రుదయం బరువయ్యింది…
ప్రతిక్షణం నీ తలపులలొ విహరిస్తూ...

Wednesday, May 28, 2008

నా మనస్సు

నీ మనసెప్పుడూ నా దగ్గర వుంటుంది.
నా మనస్సులొ నీ మనస్సూ వుంటుంది.
నిరంతరం నీ మనసు నా దగ్గర వుంటుంది.
నేను ఎక్కడకు వెళ్ళినా ఏమి చేసిన నువ్వే వుంటావ్.
నేను ఏమి చేసినా అది నువ్వు చేసినట్ట్లె ప్రియా...!
నాకు అద్రుష్టం ( నువ్వు నా అద్రుష్టం ) దక్కదని భయం.
నాకే ప్రపంచం వద్దు నువ్వే నా అందమైన నిజమైన ప్రపంచానివి.
నాకు ఛందమామ అంటే ఏమిటో తెలుసా? అది నువ్వే
వేరులొ వేరు, మొగ్గలొ మొగ్గ, జీవితమనే చెట్టు మీద
ఆకాశం లొ ఆకాశం, ఈ ఆకాశం ఆత్మ కన్న విస్తారంగా వుంటుంది.
ఈ ఆద్భుతమే ఆకాశం నుండి నక్షత్రాలను వేరు చేసేది.
ప్రియా నా హ్రుదయం లొ నీ హ్రుదయం వుంచు...!

Saturday, February 16, 2008

నా కాలం

గతించిన నా కాలం "గతుకుల మయం"

కదులుతున్న నా కాలం "కన్నీళ్ళమయం"

రాబొయే నా కాలం

రాసుకొబొతున్న ఓ "అగ్ని కణం"

Thursday, February 14, 2008

స్నేహమా!!! లేక నా పాలిట శాపమా!!!

స్నేహమా!!! లేక నా పాలిట శాపమా!!!

చిరునవ్వుతొ పరిచయం అయ్యావు

అభిమానంతొ నాకు దగ్గర అయ్యావు

నీవు నాపై చూపిన అప్యాయతకు

నీను పొందిన సంతొషం అంతా ఇంతా కాదు

ఆ సంతొషం నాకు ఒక కల లాగే మిగిలింది

ఆ కల ఒక పీడ కల అని తెలిసిన తరువాత

నేను పడిన బాధ క్రితం సంతొషం కన్నా చాలా ఎక్కువ
నీవు నాపై చూపిన అభిమానం నిజమనుకున్నాను
నీవు నాపై చూపిన అప్యాయత నిజమనుకున్నాను
ఇవి అన్ని ఒట్టి నా భ్రమ మాత్రమే

నేను ప్రేమ అనుకున్నాను

దానికి నువ్వు పెట్టిన పేరు స్నేహం

నీది స్నేహమా!!! కానే కాదు

" ఒక తియ్యటి శాపం "..!




మీ
కొమ్మి గాడు

ఓంటరి దు:ఖం

ఓంటరి దు:ఖం
గుండె ఎడారిలొ
తొలకరి జల్లై కురుస్తుంది
చెదరిన స్వప్నం
కళ్ళనిండా మ్రుత్యువై పరచుకుంటుంది
చెప్పాలని వుంది
కాని ఇప్పటిదాక దాచుకున్న
నిన్నటి కన్నీళ్ళ వెచ్చదనం  
వేడి వెన్నలై పారూతూనే వుంది
హఠాత్తుగా మేల్కొన్న నిర్లిప్తత
గొంతు నిండా నిస్సబ్ధ సంద్రమై పొంగుతుంది
ఏ ఙాపకాన్ని హత్తుకున్నా
జల జల రాలే కన్నీటి బిందువులే
రెప్ప వాల్చని రాత్రుల్లొ
మౌన పత్రాలై
ఘనీభవిస్తున్న దేహం లొకి
సుడులు తిరుగుతాయి
సగం రాత్రి కరిగాక
నిస్సబ్ధం ఆవరిస్తుంది
చీకట్లొ తడిసిన మౌనం
ఒక సుదీర్ఘ నిట్టూర్పుతొ
ఆరుబయట తూఫాను కొసం
కిటికీ తెరుస్తుంది
పొరలు పొరలుగా విచ్చుకున్న ఏకాంతం లో
చిరునవ్వుతొ మ్రుత్యువును కౌగిలించుకుంటుంది.

Friday, January 18, 2008

నందమూరి తారకరామా...!

నందమూరి తారకరామా!
నవరస నటనా సార్వభౌమ!
చిత్రసీమ నభస్సులొ మెరిసిన
హరి చాపం నీ రూపం!
చిత్రసీమ సరస్సులొ విరిసిన
అరవిందం నీ అందం!
తెలుగు నాడు ఆరాధించిన
శ్రీరాముని రూపం నీది!
తెలుగు వాడు ఆస్వాదించిన
శ్రీక్రుష్ణుని తత్వం నీది!
రాజసం మూర్తిభవించిన రారాజువై
పౌరుషం ప్రజ్వరిల్లిన రావణ బ్రహ్మవై
భీకరాకారం తొ గర్జించిన భీమసేనుడవై
శివతాండవం శివమెత్తిన నిజలాక్షుడవై
గ్రీష్మ తేజస్సు తొ విక్రమించిన భీష్ముడవై
స్వామిభక్తి కి సంకేతం గా నిలచిన కర్ణుడవై
తెలుగుతేజం పరవశించిన క్రుష్ణరాముడవై
లొకానికి విజ్ఞ్ణానం వెదజల్లిన వీరబ్రహ్మవై
ఏన్ని పాత్రలలొ జీవించినావొ
ఎంత వైవిధ్యం చూపించినావొ
పట్టిన పట్టు సాధించే,నీ సాహసం వజ్రసంకల్పం
చేపట్టిన కార్యం సాగించే
నీ రాజసం రాజకీయ శిల్పం
మొన్న:
తెలుగు తెర పై కధానాయకుడవు
నిన్న:
తెలుగు ధర పై ప్రజానాయకుడవు
నేడు:
తెలుగు జాత్తి కి స్పూర్తి ప్రదాతవు
తెలుగుదేశం - నీ ఆవేశం !
భారతదేసం - నీ ఆదర్శం!
వెలుగు కొసం - నీ సందేశం!
పొంగి వచ్హె స్వాభిమానం - నీ సిరి
సమస్త ప్రజా సంక్షేమం - నీ వూపిరి

Tuesday, January 15, 2008

నా పయనం

"ఎటు వైపొ నా పయనం నన్ను అడగకు
నన్ను ముందుకు తోస్తున్న కాలాన్ని అడుగు...
లేకుంటే గతిని మార్చే నా తలరాతని అడుగు..."

"గమ్యం చేరే వరకు తెలియదు దాని విలువ ఏమిటొ
మరణం దరి చేరేవరకు తెలియదు ఈ జీవితం విలువ ఎంతో"

"ప్రతి క్షణం నీదిగా..! ప్రతి క్షణం నీవుగా..!
జీవితం లొ జీవించు ... అనుకున్నది సాధించు..."

Friday, January 11, 2008

ఒక్కసారి...

నీకు నాకు మధ్య మాటల వంతెన నిశ్శబ్ధం గా కూలిపొయింది,
మౌనం పెరిగింది అపార్ధాల అగాధం పున:నిర్మాణ ప్రయత్నం లొ
ఎన్నొ వేల మెట్లు దిగి నీకై ఈ చివరి ప్రయత్నం
కొన్నిసార్లు మౌనం జీవితకాలపు ప్రశ్నల్ని మిగిల్చేస్తుంది
పెనవేసుకొవాలనుకున్న పవిత్ర బంధం పరిధులను నిర్మించుకుంది
నువ్వు వస్తావని నేను, నేను పిలుస్తానని నీవు…
ఒకే ఒడ్డున ఎవరికి కాకుండా నిలుచున్నాం
అడిగితె చెబుదామని నేను, చెబితె విందామని నీవు…
మనిద్దరి మధ్యన అహం అడ్డుగొడలు నిర్మించుకున్నాం
ఒక్కసారి చూడు, నా కళ్ళలొకి, సప్త సముద్రాలు కనురెప్పలమాటున…
ఒక్కసారి విను, తప్పొప్పుల బేరీజు నడుమ సతమతమయిన
మనసు మూగవేదనను మౌనం అంతా మాటలుగా మారి
గుండె లొతుల్లొ గొంతుకను దాచేసింది.

ఒక్కసారి పలుకరించి చూడు వెల్లువలా నిన్ను ముంచెత్తుతుంది.
కనురెప్పల మాటున దాగిన స్వప్నం రూపం చూసిందెవరు?
అందుకే ఆవేదనను ఇలా నివేదన చేస్తున్నాను.
నా కళ్ళ వాకిళ్ళలొ స్వప్నాల తోరణాలు కట్టి వేచి వున్నాను
నువ్వు వస్తావని...
నా మనసు ముంగిట్లొ ఆశల రంగవల్లులు దిద్దాను
సంక్రాంతి వెలుగులు తెస్తావని...

“ఫ్రేమ వున్నచొట భాధ్యత బరువు కాదు”

Monday, January 7, 2008

పుణ్యం-పాపం

ఏ పుణ్యం చేసుకున్నవొ ఆ జడగంటలు
నీ నల్లని కురులకు జతగా చేరినందుకు
ఏ పుణ్యం చేసుకున్నదొ ఆ ఎర్రటి తిలకం
నీ నుదుటి పై చందమామలా నిలచినందుకు
ఏ పుణ్యం చేసుకున్నదొ ఆ నల్లని కాటుక
నీ నయనాల చెంత ఉన్నందుకు
ఏ పుణ్యం చేసుకున్నవొ ఆ గల గల మనే గాజులు
నీ మ్రుదువైన హస్తాలను తనలొ దాచుకున్నందుకు
మరి ఏ పాపం చేసుకున్నదొ నా చిన్ని మనస్సు
నీ మనస్సు చేరనందుకు .....